Header Banner

ప్రమాదంలో ఉన్నామని చెప్పినా ఇండిగో విమానానికి దారివ్వని పాకిస్థాన్! భయాందోళనలో ప్రయాణికులు!

  Fri May 23, 2025 09:40        India

ఢిల్లీ నుంచి శ్రీనగర్ వెళ్తున్న ఇండిగో విమానం (6E2142) బుధవారం సాయంత్రం గగనతలంలో తీవ్రమైన కుదుపులకు లోనైంది. విమానం అమృత్‌సర్ ప్రాంతం వద్ద వడగళ్ల వానతో కూడిన తుఫానులో చిక్కుకోవడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. విమానం ముక్కు భాగం దెబ్బతిన్నా, పైలట్ చాకచక్యంగా స్పందించి సమీప లాహోర్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌ను సంప్రదించి తుఫాను నుంచి తప్పించుకునేందుకు పాకిస్థాన్ గగనతలంలోకి ప్రవేశానికి అనుమతి కోరాడు.
అయితే, పాక్ అధికారులు ఈ అభ్యర్థనను తిరస్కరించడంతో, పైలట్ అదే మార్గంలో ప్రయాణం కొనసాగించి సాయంత్రం 6:30కి శ్రీనగర్ విమానాశ్రయంలో అత్యవసరంగా విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు. విమానంలో ఉన్న 227 మంది ప్రయాణికులు, సిబ్బంది ఎవరూ గాయపడకుండా బయటపడ్డారు. విమానానికి నోస్ భాగంలో నష్టం వాటిల్లింది. దీనివల్ల విమానాన్ని తాత్కాలికంగా సేవల నుంచి ఉపసంహరించి ‘ఎయిర్‌క్రాఫ్ట్ ఆన్ గ్రౌండ్’గా ప్రకటించారు. ఇదంతా పుల్వామా దాడి అనంతరం పాక్-భారత్ మధ్య వాస్తవంగా ఏర్పడిన ఉద్రిక్తతల నేపథ్యంలోనే జరిగిందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి: ఏపీలో రేషన్ కార్డులు ఉన్నవారికి గుడ్‌న్యూస్..! వచ్చే నెల నుంచి ఆ రూల్ రద్దు?


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వైసీపీ మాజీ మంత్రికి అష్టదిగ్బంధన! లుక్ అవుట్ నోటీసులు జారీ!


ఏపీలో ఎంట్రీ ఇచ్చిన కరోనా.. తొలి కేసు నమోదు! ఎక్కడంటే!


ఆ ఉద్యోగులకు శుభవార్త ! ప్రభుత్వం వాటికి గ్రీన్ సిగ్నల్!


దివ్యాంగులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు..! ఇళ్ల కేటాయింపులో రిజర్వేషన్!


అసెంబ్లీ సీట్ల డీలిమిటేషన్ పై బిగ్ అప్డేట్! కలిసొచ్చేదెవరికి..!


అది నిజం కాకపోతే జగన్ రాజీనామా చేస్తారా? టీడీపీ నేత సవాల్!


తెలుగు రాష్ట్రాలకు కృష్ణా జలాలు! కేఆర్ఎంబీ కీలక ఉత్తర్వులు!


సైన్స్‌కే సవాల్..! చంద్రుడినే పవర్ హౌస్‌గా మారుస్తామంటున్న ఎడారి దేశం..!


ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group




   #andhrapravasi #IndiGoFlight #MidAirTurbulence #PakistanDenial #AviationNews #FlightEmergency #IndiGo227 #PassengerPanic